హోళీ శుభాకాంక్ష‌లు చెప్పిన ప్ర‌ధాని, రాష్ట్ర‌ప‌తి

Thu,March 21, 2019 11:40 AM

PM Narendra Modi, President Kovind tweet Holi greetings

హైద‌రాబాద్: దేశ ప్ర‌జ‌లు ఇవాళ హోళీ పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ, రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ .. దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌విత్ర‌మైన హోళీ పండుగ సంద‌ర్భంగా ప్ర‌తి ఒక భార‌తీయుడికి విషెష్ చెబుతున్న‌ట్లు మోదీ ట్వీట్ చేశారు. ఈ రంగుల పండుగ‌ మ‌న ఐక్య‌త‌ను చాటుతుంద‌న్నారు. క‌రుణ‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌న్నారు.



రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా హోళీ శుభాకాంక్ష‌లు చెప్పారు. విదేశాల్లో ఉన్న భార‌తీయుల‌కు కూడా ఆయ‌న పండుగ విషెష్‌ చెప్పాడు. హోళీ పండుగ ప్ర‌జ‌ల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని తెస్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు.


363
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles