బీజేపీ కార్యాలయానికి వాజ్‌పేయి భౌతికకాయం

Fri,August 17, 2018 11:27 AM

PM Narendra Modi pays last respects to former pm  Vajpayee at BJP Headquarters

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహనికి పార్టీ అగ్రనేతలు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, తదితరులు నివాళులర్పించారు. అటల్‌జీని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS