ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కిన మోదీ.. వీడియో

Fri,April 26, 2019 11:58 AM

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ.. పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కాళ్లు మొక్కారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల నేతలు తరలివచ్చారు. వారణాసి కలెక్టరేట్ వద్ద ఎన్డీయే పక్షాల నేతలతో ప్రధాని మోదీ సమావేశమై కాసేపు మాట్లాడారు. అనంతరం మోదీ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ సీఎం నితీష్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.1801
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles