ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

Tue,April 23, 2019 09:16 AM

PM Narendra Modi casts his vote at a polling booth in Ranip Ahmedabad

గుజరాత్: ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రనిప్ పోలింగ్ కేంద్రంలో మోడీ తన ఓటును వేశారు. అంతకు ముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి ప్రధాని వెళ్లారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం ప్రధాని ఓటు వేయడానికి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల సమరాంగణంలో మూడో విడుత పోరుకు ఓటింగ్ కొనసాగుతోంది. 13 రాష్ర్టాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు మూడో విడుత బరిలో ఉన్నారు.

ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గుజరాత్ (26), కేరళ (20)లోని అన్ని లోక్‌సభ స్థానాలతోపాటు, అసోం- 4, బీహార్- 5, ఛత్తీస్‌గఢ్- 7, కర్ణాటక- 14, మహారాష్ట్ర- 14, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 10, పశ్చిమ బెంగాల్- 5, గోవా- 2, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, త్రిపురలో ఒక్కో లోక్‌సభ సీటుకు ఈ విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి. మూడో విడత పోలింగ్ కు 210000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles