ప్రధాని పదప్రయోగం.. రికార్డుల నుంచి తొలిగింపు

Fri,August 10, 2018 02:08 PM

PM Modis remarks on Congress leader in Parliament expunged

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా హరి ప్రసాద్ పోటీపడ్డారు. రాజ్యసభలో హరివంశ్‌కు కంగ్రాట్స్ చెప్పిన మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను రెచ్చగొట్టేవిధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను విపక్ష అభ్యర్థి హరిప్రసాద్ తప్పుపట్టారు.

పద ప్రయోగంతో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అభ్యర్థిపై కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని, సభ హుందాతనానికి కూడా నష్టం తీసుకువచ్చారని హరిప్రసాద్ ఆరోపించారు. అయితే పద ప్రయోగంతో విపక్ష అభ్యర్థిని ఇబ్బంది పెట్టిన మోదీ ప్రసంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడిన అంశం నుంచి కొన్ని పదాలను తొలగించడం ఇదే మొదటిసారి.

3158
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles