టీచ‌ర్స్ డే.. మోదీ వీడియో

Thu,September 5, 2019 08:59 AM

హైద‌రాబాద్‌: ఇవాళ ఉపాధ్యాయుల దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ టీచ‌ర్లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఆయ‌న ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్ జ‌యంతినే మ‌నం ఉపాధ్యాయుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటాం. ఈ నేప‌థ్యంలో రాధాకృష్ణ‌న్‌కు మోదీ నివాళి అర్పించారు. రాధాకృష్ణ‌న్ అత్యుత్త‌మ ఉపాధ్యాయుడ‌న్నారు. ఓ మంచి మార్గ‌ద‌ర్శ‌కుడు కూడా అని త‌న ట్వీట్‌లో మోదీ తెలిపారు. టీచ‌ర్ల‌కు వ‌య‌సుతో సంబంధంలేద‌ని, రిటైర్మెంట్ ఉండ‌ద‌ని ప్ర‌ధాని త‌న వీడియో సందేశంలో చెప్పారు. ఎన్నో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించినా.. రాధాకృష్ణ‌న్ మాత్రం ఓ శిక్ష‌కుడిగానే ఉన్నార‌న్నారు. బోధ‌నాత‌త్వాన్ని మ‌ర‌వ‌నివారే మంచి టీచ‌ర్లు అవుతార‌న్నారు. మెరుగైన విద్యార్థుల‌ను త‌యారు చేస్తార‌న్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ కూడా టీచ‌ర్లంద‌రికీ గ్రీటింగ్స్ తెలిపారు.

651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles