ప‌్ర‌ధానిని ప్రశ్నించనున్న పీఏసీ !

Mon,January 9, 2017 01:39 PM

PM Modi to be summoned by Parliamentary Panel over demonetisation issue

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌ధాని మోదీకి పార్ల‌మెంట‌రీ క‌మిటీ స‌మ‌న్లు జారీ చేసే అవ‌కాశాలున్నాయి. ఏ కార‌ణం చేత నోట్ల ర‌ద్దును చేప‌ట్టార‌ని తెలుసుకునేందుకు ప్ర‌ధానికి స‌మ‌న్లు ఇచ్చే అవ‌కాశాలున్న‌ట్లు పార్ల‌మెంట‌రీ క‌మిటీ చీఫ్ వీకే థామ‌స్ అభిప్రాయ‌ప‌డ్డారు. నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకున్నారో వెల్ల‌డించేందుకు త‌మ‌ను క‌ల‌వాల‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జిత్ ప‌టేల్‌ను ఆదివారం ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీ ఆదేశించింది. ఈనెల 20వ తేదీలోపు నోట్ల ర‌ద్దుకు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. ఆ నిర్ణ‌యం వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌లిగిన ప్ర‌భావాన్ని వివ‌రించాల‌ని పీఏసీ కోరిన విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 8న రూ.500, వెయ్యి నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే నోట్ల ర‌ద్దు అంశంపై ఎవ‌రినైనా ప్ర‌శ్నించే అధికారం పీఏసీకి ఉంద‌ని థామ‌స్ తెలిపారు. కానీ జ‌న‌వ‌రి 20న ఉర్జిత్ పటేల్‌తో జ‌రిగే స‌మావేశం అనంత‌రం నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. ఒక‌వేళ పీఏసీ స‌భ్యులంతా ఏక‌గ్రీవంగా నిర్ణ‌యిస్తే, తాము ప్ర‌ధానిని కూడా నోట్ల ర‌ద్దు అంశంపై విచారిస్తామ‌ని థామ‌స్ అన్నారు.

2267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles