ప్రధాని క్షమాపణలు చెప్పాల్సిందే.. పార్లమెంట్‌లో దుమారం

Wed,December 20, 2017 12:51 PM

PM Modi statement on Pak involvement in Gujarat polls rock Parliament today

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే. ఇవాళ ఉభయసభల్లోనూ విపక్షాలు ఇదే డిమాండ్ చేశాయి. దీంతో రెండు సభలూ దద్దరిల్లాయి. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటున్నదని ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో దుమారం లేపుతున్నారు. శీతాకాల సమావేశాల ఆరంభం నుంచే ప్రధాని మోదీ సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభలు కూడా ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ అంశంపై మాట్లాడారు. నిరసన వ్యక్తం చేసే పద్ధతి ఇది కాదు, ఎవరూ క్షమాపణలు చెప్పలేరు, సభలో ఏమీ జరగలేదు, పాక్ జోక్యం చేసుకుందన్న ప్రకటన సభలో చేసింది కాదు అని చైర్మన్ వెంకయ్య అన్నారు.

మ‌ళ్లీ మ‌ధ్యాహ్నాం కూడా రాజ్య‌స‌భ‌లో అదే సీన్ రిపీట్ అయ్యింది. విప‌క్షాలు ప్ర‌ధాని క్ష‌మాప‌ణ చెప్పాలంటూ వెల్‌లోకి దూసుకువెళ్లాయి. మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ప్ర‌ధాని మోదీ స్పందించాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేశాయి. గంద‌ర‌గోళం నేప‌థ్యంలో స‌భ‌ను గురువారానికి వాయిదా వేశారు. ప్ర‌ధాని మోదీని గౌర‌విస్తామ‌ని, ఆయ‌న‌కు ధైర్యం ఉంటే గుజ‌రాత్ ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌భ‌లో చేయాల‌ని, క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు ఆయ‌న‌కు ఇబ్బందిగా తోస్తే, తాను గుజ‌రాత్ ఎన్నిక‌ల కోస‌మే అలా చేసాన‌ని చెప్పాల‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొవాల‌ని ఎంపీ ఆజాద్ డిమాండ్ చేశారు. మ‌రోవైపు మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ‌లో బిల్లుల‌పై చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో .. కాంగ్రెస్ స‌భ్యులు స‌భ నుంచి వాకౌట్ చేశారు.

3107
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles