హువా తో హువా.. ఇదీ కాంగ్రెస్ నైజం

Fri,May 10, 2019 03:13 PM

PM Modi slams congress party for Sam Pitrodas Hua to hua comment on 1984 anti Sikh riots

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ ఏఎన్ఐ మీడియా సంస్థ‌తో మాట్లాడారు. సిక్కుల ఊచ‌కోతపై కాంగ్రెస్ నేత శ్యామ్ పెట్రోడా చేసిన (హువా తో హువా అంటే అయ్యిందేదో అయ్యింది) వ్యాఖ్య‌ల‌ను ఊటంకిస్తూ.. అది కాంగ్రెస్ నైజాన్ని చాటుతోంద‌న్నారు. హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌లో ఓ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన మోదీ.. మీడియా సంస్థ‌తో మాట్లాడారు. 1984లో చోటుచేసుకున్న సిక్కు అల్ల‌ర్ల‌పై శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీ వ్య‌క్తిత్వాన్ని బ‌య‌ట‌పెడుతోంద‌న్నారు. ఓ భారీ వృక్షం నేల‌కూలిన‌ప్పుడు భూమి కంపిస్తుంద‌ని మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ అన్నారు, కానీ సిక్కుల ఊచ‌కోత‌లో నిందితుడిగా ఉన్న క‌మ‌ల్‌నాథ్‌ను పంజాబ్‌కు ఇంచార్జ్‌గా చేశార‌ని, ఇప్పుడు ఆయ‌నే మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం అయ్యార‌ని మోదీ విమ‌ర్శించారు. సిక్కుల ఊచ‌కోత‌పై శ్యామ్ పిట్రోడా మాట్లాడిన తీరు కాంగ్రెస్ అహంకారాన్ని ప్ర‌స్పుటిస్తున్న‌ద‌ని, అందువ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో వాళ్ల‌కు కేవ‌లం 44 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని, ఇప్పుడు ఆ సంఖ్య కూడా త‌గ్గుతుంద‌ని మోదీ అన్నారు.
చంద్ర‌బాబు నేతృత్వంలోని విప‌క్ష నేత‌లు కూట‌మి క‌ట్టిన విష‌యంపైన కూడా మోదీ స్పందించారు. మొద‌టి మూడు ద‌శ‌ల స‌మ‌యంలో వాళ్లు మోదీని వ్య‌తిరేకించార‌ని, ఇప్పుడు మాత్రం ఈవీఎంల‌ను త‌ప్పుప‌డుతున్నార‌ని ప్ర‌ధాని ఆరోపించారు. క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఔటైన త‌ర్వాత ఒక్కొక్క‌సారి అంపైర్‌ను నిందించిన‌ట్టుగా విప‌క్షాల తీరు ఉంద‌ని మోదీ విమ‌ర్శించారు. మ‌సూద్ అజ‌ర్‌, దావూద్ ఇబ్ర‌హీం లాంటి వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా అని అడిగిన ప్ర‌శ్న‌కు మోదీ బ‌దులిస్తూ.. దేశానికి ప్ర‌మాదంగా మారిన వారిని ఏరిపారేస్తామ‌న్నారు. భార‌త్‌ను, భార‌తీయుల‌ను ర‌క్షించ‌డం బీజేపీ బాధ్య‌త అన్నారు.

875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles