విద్యాసాగ‌ర్ భారీ విగ్ర‌హం ప్ర‌తిష్టిస్తా: మోదీ

Thu,May 16, 2019 12:18 PM

PM Modi promises grand Vidyasagar statue amid battle with Trinamool

హైద‌రాబాద్‌: రెండు రోజుల క్రితం కోల్‌క‌తాలో అమిత్ షా రోడ్డు షో స‌మ‌యంలో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో బెంగాలీ విద్యావేత్త ఈశ్వ‌ర్ చంద్ర విద్యాసాగ‌ర్ విగ్ర‌హం ధ్వంస‌మైన విష‌యం తెలిసిందే. అయితే విగ్ర‌హం ధ్వంసం అయిన చోటే మ‌రో భారీ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టాప‌న చేస్తాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఇవాళ యూపీలోని మావు ప‌ట్ట‌ణంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈశ్వ‌ర్ చంద్ర విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, విద్యాసాగ‌ర్ విజన్‌కు మేం క‌ట్టుబడి ఉన్నామ‌ని, పంచ‌లోహాల‌తో త‌యారు చేసిన విద్యాసాగ‌ర్ భారీ విగ్ర‌హాన్ని అక్క‌డే ప్ర‌తిష్టిస్తామ‌ని ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే మోదీ ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ స్పందించారు. త‌న ట్విట్ట‌ర్‌లో మోదీని తీవ్రంగా విమ‌ర్శించారు. మోదీ అబ‌ద్దాల కోరు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.2269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles