ఓటేసిన ప్రధాని మోదీ తల్లి

Tue,April 23, 2019 10:31 AM

గుజరాత్‌ : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి వద్దకు వెళ్లిన మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. మోదీ ఓటేసిన అనంతరం మాట్లాడుతూ.. ఐఈడీ బాంబుల కన్నా.. ఓటరు ఐడీ అత్యంత శక్తివంతమైనందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాదులకు ఐఈడీ బాంబులే ఆయుధాలు అని, కానీ ప్రజాస్వామ్యానికి ఓటరు ఐడీయే శక్తి అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.



1139
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles