తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ

Tue,April 23, 2019 09:58 AM

PM Modi meets his mother Heeraben Modi in Gandhinagar and takes her blessings

గుజరాత్‌ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం గాంధీనగర్‌లో తన తల్లి నివాసముంటున్న ఇంటికి వెళ్లారు. అహ్మదాబాద్‌లోని రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో మోదీ ఓటేసే కంటే ముందు.. తల్లితో ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లికి మోదీ పాదాభివందనం చేశారు. మోదీకి హీరాబెన్‌ స్వీటు తినిపించి.. ఆ తర్వాత తలపై చేతి పెట్టి ఆశీర్వదించారు. అనంతరం మోదీ కూడా తల్లికి స్వీటు తినిపించి.. ఓటేసేందుకు బయల్దేరారు. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.957
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles