రాజ్ థాక్రే కుమారుడి పెళ్లి.. మోదీకి అందని ఆహ్వానం

Mon,January 14, 2019 02:51 PM

ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ అధినేత రాజ్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే వివాహాం జనవరి 27న జరగనుంది. ప్రముఖ డాక్టర్ సంజయ్ బోరుడే కుమార్తె మిథాలి బోరుడేను అమిత్ వివాహం చేసుకోబోతున్నారు. ఈ వివాహం లోయర్ పారెల్ లోని సెయింట్ రేగిస్ హోటల్ లో 27న జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. అమిత్ పెళ్లికి రావాలని దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రం ఆహ్వానం అందలేదు. అయితే కొద్దిరోజుల క్రితం కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్‌థాకరే స్పందిస్తూ.. 'పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?' అంటూ బదులిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాని మోదీని రాజ్‌ఠాక్రే ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.


గత వారం రాజ్ థాక్రే ఢిల్లీకి వెళ్లాల్సి ఉండే. కానీ అనివార్య కారణాల వల్ల థాక్రే ఢిల్లీకి వెళ్లలేదు. దీంతో ఆయన అనుచరులు హర్షల్ దేశ్ పాండే, మనోజ్ హాటే ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవడేకర్, ధర్మేంద్ర ప్రధాన్, మనేకా గాంధీతో పాటు పలువురిని పెళ్లికి ఆహ్వానించారు. మోదీకి ఆహ్వానం అందకపోవడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ కొనసాగుతోంది. అయితే మహారాష్ర్ట నవనిర్మాణ సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి వచ్చే ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి బరిలోకి దిగనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మోదీని పెళ్లికి ఆహ్వానించకపోవడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూరుతోంది.

2111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles