మోదీ ఓ పబ్లిసిటీ పీఎం..

Sat,January 19, 2019 02:36 PM

కోల్‌క‌తా: ఐక్య‌త ర్యాలీలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడారు. ప్ర‌ధాని మోదీ ఓ ప‌బ్లిసిటీ పీఎం అని, కానీ మ‌న‌కు ప‌నిచేసే ప్ర‌ధాని కావాల‌ని బాబు అన్నారు. కోల్‌క‌తాలో జ‌రుగుతున్న ఐక్య‌త ర్యాలీలో మాట్లాడుతూ.. త‌మ‌కు దేశాన్ని ఐక్యంగా ఉంచాల‌న్న ఉద్దేశం ఉంద‌ని, కానీ బీజేపీ మాత్రం దేశాన్ని విభ‌జిస్తోంద‌ని తెలిపారు. గ‌తంలో ఆర్థిక అభివృద్ధి బాగుండేద‌ని, అయితే ప్ర‌గ‌తి నెమ్మ‌దించ‌డం వ‌ల్ల ఉద్యోగాలు లేవ‌ని అన్నారు. క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చితే, బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈవీఎంలు ఓ పెద్ద ఫ్రాడ్ అన్నారు. ఏ దేశంలోనూ ఈవీఎంల‌ను వాడ‌డం లేద‌ని, మ‌ళ్లీ మ‌నం పేప‌ర్ బ్యాలెట్‌ను తీసుకురావాల‌న్నారు. బీజేపీ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌ని, 2019లో కొత్త పీఎం వ‌స్తార‌ని బాబు అన్నారు.

1180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles