ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల్లో ధైర్యం నింపిన మోదీ

Sat,September 7, 2019 02:31 AM

హైద‌రాబాద్‌: ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల ప‌ట్ల దేశం గ‌ర్వంగా ఫీల‌వుతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ అంద‌క‌పోవ‌డంతో ఇస్రో సెంట‌ర్‌లో టెన్ష‌న్ నెల‌కొన్న‌ది. ఆ స‌మ‌యంలో మోదీ.. అక్క‌డ ఉన్న శాస్త్ర‌వేత్త‌ల‌తో మాట్లాడారు. మీది చిన్న అచీవ్‌మెంట్ కాద‌న్నారు. మీ కృషి ఎంతో నేర్పిందన్నారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మాన‌వ‌జాతికి ఉత్త‌మ‌ సేవ‌చేశార‌న్నారు. చాలా దిగులుగా క‌నిపించిన శాస్త్ర‌వేత్త‌ల్లో మోదీ జోష్ నింపే ప్ర‌య‌త్నం చేశారు. నేను మీవెంటే ఉంటాన‌ని ఆయ‌న వారికి హామీ ఇచ్చారు. ధైర్యంతో ముంద‌కు వెళ్దామ‌న్నారు. మ‌ళ్లీ మ‌రికొన్ని ప్ర‌య‌త్నాల‌తో ముందుకు వెళ్దాం అన్నారు. ఆల్ ద బెస్ట్ అని మోదీ తెలిపారు. మిష‌న్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన విద్యార్థుల‌తోనూ మోదీ మాట్లాడారు. విద్యార్థులు అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles