వడదెబ్బతో కూలిన గార్డు.. ఆరా తీసిన ప్రధాని

Mon,June 25, 2018 01:02 PM

PM Modi inquires about health of IAF guard who collapsed at Rashtrapati Bhavan

న్యూఢిల్లీ: సీషెల్స్ అధ్యక్షుడు డాన్నీ ఫౌరీ ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఆ సమయంలో భారతీయ వైమానిక దళానికి చెందిన ఓ గార్డు .. స్టేజ్‌పై కుప్పకూలాడు. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నాయి. వడదెబ్బ తగిలిన ఆ గార్డు.. సర్మోనియల్ రిసెప్షన్ సమయంలో నేల కూలాడు. ఆ తర్వాత గార్డు ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అంతకముందు రాష్ట్రప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ .. సీషెల్స్ అధ్యక్షుడికి స్వాగతం పలికారు. సాధారణంగా ప్రతి ఏడాది ఈ సమయంలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల కన్నా.. ఢిల్లీలో గత అయిదారు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఇలాగే వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. జూన్ 29 తర్వాతే రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.2501
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles