ఎన్డీ తివారీ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం

Thu,October 18, 2018 05:18 PM

PM Modi condolence to ND Tiwari death

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మాజీ నేత, మాజీ సీఎం నారాయణదత్ తివారీ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. తివారీ కుటుంబ సభ్యులకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

ఎన్డీ తివారీ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. తమ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

మాజీ సీఎం తివారీ మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. తివారీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన యోగి.. తివారీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గొప్ప పరిపాలనదక్షుడిగా ఆయన ప్రజల మదిలో గుర్తుండిపోతారని యోగి కొనియాడారు.
2080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS