
సిల్వస్సా: విపక్షాల చేస్తున్న ఐక్యర్యాలీ మోదీకి వ్యతిరేకంగా కాదని అది దేశ ప్రజలకు వ్యతిరేకంగా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో కోల్ నేడు విపక్షాల ఐక్యర్యాలీ జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్ సరిహద్దు ప్రాంతం సిల్వస్సాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ సభపై స్పందించారు. విపక్షాల ర్యాలీ.. అది భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీ అన్నారు. వాళ్ల ఐక్యత కూడా సరిగా లేదన్నారు. వాళ్ల వాళ్ల వాటాల కోసం అప్పుడే భేరసారాలు మొదలుపెట్టారన్నారు. అవినీతిపై తన చర్యలు కొంతమందిని కలవరపెడుతున్నాయన్నారు. ప్రజల సొత్తు దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి కోపం రావడం సహజం. ఈ క్రమంలోనే వారంతా ఒక్కటయ్యారు. ఐక్యకూటమిగా పిలుచుకుంటున్నారని ప్రధాని పేర్కొన్నారు.