మోదీ బ‌ర్త్‌డే.. దేశ‌వ్యాప్తంగా సేవా దివ‌స్‌

Fri,September 14, 2018 06:51 PM

PM Modi birthday to be observed as Sewa Divas on September 17

న్యూఢిల్లీ: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న 68వ పుట్టిన రోజు.. ఈ నెల 17వ తేదీన జ‌రుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గ‌మైన వార‌ణాసిలో ఆయ‌న అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆ రోజున దేశ‌వ్యాప్తంగా సేవా దివ‌స్ నిర్వ‌హించ‌నున్నారు. స్వ‌చ్ఛ‌భార‌త్‌తో పాటు ర‌క్త‌దాన శిబిరాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. వార‌ణాసిలోని ఓ స్కూల్‌లో విద్యార్థుల‌తో క‌లిసి మోదీ బ‌ర్త్‌డే కేక్‌ను క‌ట్ చేయ‌నున్నారు. ఆ త‌ర్వాత కొన్ని వేల కోట్ల ఖ‌రీదైన ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. ఆ రోజునే రింగు రోడ్డును ప్రారంభిస్తారు. మ‌హిళ‌ల కోసం రెండు హాస్ప‌ట‌ళ్ల‌కు శంకుస్థాప‌న చేస్తారు. 600 కోట్ల నిర్మించ‌నున్న క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్‌కు కూడా మోదీ శంకుస్థాప‌న చేస్తారు. శివ భ‌క్తుడైన మోదీ.. ఆ రోజున కాశీ విశ్వ‌నాథ్ ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు. హిందూ బ‌నార‌స్ విశ్వ‌విద్యాల‌యంలో జ‌రిగే మ‌రో కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

2510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles