బీజేపీకి మోదీ, అమిత్ షా రూ.వెయ్యి విరాళం!

Mon,February 11, 2019 04:16 PM

PM Modi and Amit Shah donated Rs 1000 to BJP fund

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ రూ.వెయ్యి విరాళం ఇచ్చారు. అయితే ఇంత తక్కువ విరాళం ఇవ్వడం ద్వారా వాళ్లు ఓ సందేశాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. పార్టీని నడిపించడానికి బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, నల్లధనంపై ఆధారపడే పరిస్థితి పోవాలని, విరాళాల్లో ఓ పారదర్శకత రావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ 51వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. విరాళాల విషయంలో మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అంతకుముందే మోదీతో కలిసి ఆయన పార్టీ యాప్ ద్వారా రూ.వెయ్యి విరాళాన్ని అందజేశారు. పార్టీ కార్యకర్తలంతా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా. నమో యాప్ ద్వారా సులువుగా ఈ పని చేయొచ్చు. నేను నా వంతు విరాళం ఇచ్చాను అని మోదీ ట్వీట్ చేశారు. మన డబ్బుతో ఈ పార్టీ నడిపిద్దాం కానీ బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, బిల్డర్ల సొమ్ముతో కాదు అని అమిత్ షా అన్నారు. వీళ్ల డబ్బుతో పార్టీ నడిస్తే అప్పుడు స్వచ్ఛంగా ఉండలేదని, తన లక్ష్యాలను చేరుకోలేదని ఆయన స్పష్టంచేశారు.

2388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles