రాఫెల్ నుంచి ప్రధాని ఇక తప్పించుకోలేరు

Tue,January 8, 2019 03:28 PM

PM cant escape rafale.. rahul

రాఫేల్ వివాదం నుంచి ఇక ప్రధాని నరేంద్రమోదీ తప్పించుకోలేరని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ అన్నారు. రాఫెల్‌పై దర్యాప్తు మొదలుపెట్టబోయిన అలోక్‌వర్మను రాత్రికిరాత్రే తొలగించారని, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయనను తిరిగి నియమించినందున ఇక అన్నీ బయటకు వస్తాయని రాహుల్ పేర్కొన్నారు. ప్రధానిని ఎవరూ కాపాడలేరని, అన్నీ స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ప్రధాని తన మిత్రుడు అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కట్టబెట్టేందుకు పబ్లిక్‌రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను గాలికి వదిలేశారని రాహుల్ దుయ్యబట్టారు. ఓవైపు అధికధరకు రాఫెల్ యుద్ధ విమానాలను కొనడమే కాకుండా రాఫెల్ ఒప్పందంలో ఇండియా పార్టనర్‌గా హెచ్‌ఏఎల్‌ను తొలగించి అనుభవం లేని అనిల్ అంబానీ స్థాపించిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి చోటు కల్పించారని కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

1000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles