టికెట్ లేకుంటే 'తేరా టైం ఆయేగా'..మ్యూజిక్ వీడియో వైరల్

Tue,February 19, 2019 09:54 PM

Piyush Goyal Tera Time Aayega Warning To Ticketless Travellers

రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన గల్లీభాయ్. ఈ చిత్రంలో అప్నా టైం ఆయేగా అంటూ వచ్చే పాట అందరినీ అలరిస్తోన్న విషయం తెలిసిందే. ఇపుడు ఇదే సాంగ్ థీమ్ తో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న రైల్వే ప్రయాణికులకు ఓ హెచ్చరిక చేశారు. అప్నా టైం ఆయేగా పాటకు చిన్న ట్విస్ట్ జోడిస్తూ తేరా టైం ఆయేగా అంటూ ఫన్ ట్రాక్ తో పీయూష్ గోయల్ అందరిని హెచ్చరించారు. రైలులో టీసీ టిక్కెట్లు తనిఖీ చేయడం, టిక్కెట్లు లేని వారికి జరిమానా విధింపు, ఫ్లాట్ పాం వద్దున్న ప్రయాణికుల ఫొటోలతో కూడిన సాంగ్ ట్రాక్ మ్యూజిక్ వీడియోను పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. మీరు టికెట్ లేకుండా వస్తే..పట్టుబడటం ఖాయమంటూ పాట పూర్తవుతుంది. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
1991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles