విద్యార్థి పిస్తోల్ ను బ్యాగులో పెట్టుకొచ్చాడు..

Wed,September 11, 2019 09:37 PM

Pistol seized from student bag he threatens to kill teacher


గ్రేటర్ నోయిడా: పుస్తకాలతో స్కూల్ కు రావాల్సిన ఓ విద్యార్థి పిస్తోల్ ను తన బ్యాగులో పెట్టుకొచ్చాడు. ఆ విద్యార్థి అంతటితో ఆగకుండా పిస్తోల్ తీసుకురావడం తప్పని చెప్పిన టీచర్ పైనే తిట్ల పురాణం మొదలుపెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్దనగర్ జిల్లాలో వెలుగుచూసింది.

సెప్టెంబర్ 3న పదకొండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బ్యాగులో పిస్తోల్ పెట్టుకుని వచ్చాడు. విమల్ కుమార్ అనే టీచర్ క్లాస్ లో అందరి బ్యాగులు తనిఖీలు చేస్తుండగా..సదరు విద్యార్థి బ్యాగులో పిస్తోల్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే దీనిపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత విద్యార్థి టీచర్ విమల్ కుమార్ ను ఐదు రోజుల్లో చంపేస్తారని బెదిరింపులకు దిగాడు. దీంతో విమల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆ విద్యార్థి టీచర్ విమల్ కుమార్ కు క్షమాపణలు చెప్పడంతో..విమల్ కుమార్ ఆ పిస్తోల్ ను విద్యార్థి తండ్రికి అందజేశాడు.

10381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles