మర్మాంగంతో ట్రాక్టర్‌ను లాగిన సాధువు

Mon,January 8, 2018 12:43 PM

Photos of a baba pulling a tractor with his Penis

అలహాబాద్ : ఓ సాధువు సాహసమే చేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసి.. అందరి నోట్లో మెదులుతున్నాడు. పెద్ద పెద్ద ట్రక్కులను, ట్రాక్టర్లను, బండ్లను, రాళ్లను తల వెంట్రుకలు, పళ్లతో లాగడం చూశాం. కానీ ఈ సాధువు మాత్రం ఏకంగా తన మర్మాంగానికి తాడును కట్టి ట్రాక్టర్‌ను లాగి.. అందరిని ఆకర్షిస్తున్నాడు. అలహాబాద్‌లో నిర్వహించిన మాఘ్ మేళాలో ఈ ప్రదర్శననను సాధువు చేశాడు. ఈ ప్రదర్శన ద్వారా తన ఆధ్యాత్మిక శక్తిని నిరూపించుకున్నట్లు సాధువు ప్రకటించాడు. సాధువు చేసిన సాహసానికి అక్కడున్న వారంతా నివ్వెరపోయారు. 2014లో ఓ సాధువు డజన్ల కొద్ది ఇటుకలను తన మర్మాంగానికి కట్టుకొని ప్రదర్శన ఇచ్చాడు. 2016లో మరో సాధువు తన మర్మాంగానికి తాడు కట్టి బండ రాయిలను లాగాడు.

16663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS