డిల్లీ నుంచి లెహ్ వరకు సైకిల్ మీద వెళ్లాడు.. ఎందుకంటే?

Thu,July 19, 2018 04:26 PM

photographer Rode a Bicycle From Delhi to Leh to create awareness on pollution

పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేనికో ఒకదానికి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. పాల ప్యాకెట్ తేవాలన్నా, ఇంటి సరుకులు తేవాలన్నా.. చివరకు పక్కనే ఉన్న స్కూల్‌లో పిల్లలను దింపి రావాలన్నా బైక్. బైక్ లేనిదే ఇంట్లో నుంచి బయట కాలు పెట్టని రోజులు ఇవి. అయితే.. బైక్‌ను అవసరానికి కాకుండా.. అనవసరంగానూ వాడుతూ మనం పర్యావరణానికి ఎంతో హాని చేస్తున్నాం. బైక్ నుంచి వెలువడే పొగ వాతావరణంలో కలిసి గాలిని కాలుష్యం చేస్తుంది. దాని ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది. అదంతా పెద్ద స్టోరీ. ఇప్పుడు ఆ వాయు కాలుష్యం గురించి మనం మాట్లాడుకోవడం కష్టం కాని.. వాహనాల వల్ల పర్యావరణానికి హాని మాత్రం కలుగుతుంది అనేది నిజం. దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్నేండ్లుగా కాలుష్యం తీవ్రత పెరిగి ఢిల్లీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే.. ఇవన్నీ ఓ వ్యక్తిని కలవరపెట్టాయి. ఎలాగైనా దీనిపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలనుకున్నాడు ఢిల్లీకి చెందిన తరుణ్ జా అనే వ్యక్తి.

స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన తరుణ్.. 15000 పెట్టి సైకిల్ కొన్నాడు. తనకు కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. ఢిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌లోని లెహ్ వరకు దాదాపు 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని సైకిల్‌పై ప్రారంభించాడు. లెహ్‌కు వెళ్లే ప్రాంతం అంతా కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. కొండల మధ్య ప్రయాణం చేయాలి. అందుకే లెహ్‌ను ఎంచుకున్నట్లు తరుణ్ తెలిపాడు. సక్సెస్‌ఫుల్‌గా ఢిల్లీ నుంచి లెహ్ చేరుకొని.. మళ్లీ లెహ్ నుంచి ఢిల్లీకి అంటే మొత్తం 2400 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి రికార్డు సృష్టించాడు.

ఇక.. తన ప్రయాణం మధ్యలో వచ్చే గ్రామాలకు వెళ్లి అక్కడి వారికి పర్యావరణం, కాలుష్యంపై అవగాహన కల్పించాడు. చిన్నచిన్న దూరాలకు బైక్‌ను వాడొద్దని సూచించాడు. పెద్ద పెద్ద కొండలు, గుట్టలను తాను సైకిల్‌పై వెళ్లానని.. మరి ఢిల్లీలోని దగ్గరి ప్రాంతాలకు కూడా బైక్‌లు వాడి కాలుష్యాన్ని పెంచొద్దని సూచించాడు. అంతే కాదు.. తన జర్నీనంతా కెమెరాలో బంధించి డాక్యుమెంటరీ తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. దీంతో ప్రస్తుతం తరుణ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

1565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS