మందుల కొరత లేదు..ఆంక్షలతో ప్రాణాలు నిలుస్తాయి

Sun,August 25, 2019 02:48 PM

Phone restriction helped save lives says JK Governor


న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. సమాచారవ్యవస్థపై ఆంక్షలు విధించడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడినట్లవుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో సత్యపాల్ మాలిక్ ను జమ్మూకశ్మీర్‌లో ఎన్ని రోజుల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని రిపోర్టర్లు ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ మాట్లాడుతూ..కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత గత 10 రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరుగలేదన్నారు. సెల్‌ఫోన్లు, టెలిఫోన్లపై ఆంక్షలు విధించడం వల్ల ప్రజల ప్రాణాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. ప్రతీ సమాచారాన్ని తాము యధాతథంగా తిరిగి ప్రజలకు అందిస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు మౌలిక వసతులు, అవసరమైన మందులు, వైద్యం అన్ని అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.

511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles