2018 కనిష్ఠానికి పెట్రోల్ ధరలు.. మరో 22 పైసలు తగ్గింపు

Sun,December 30, 2018 02:46 PM

Petrol rates touched this year low and Diesel to 9 month low

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ఆదివారం ఈ ఏడాదిలోనే కనిష్ఠ ధరను తాకాయి. ఆదివారం పెట్రోల్ ధర 22 పైసలు, డీజిల్ ధర 23 పైసలు తగ్గింది. ఈ తగ్గింపుతో డీజిల్ 9 నెలల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.69.04గా ఉంది. డీజిల్ ధర రూ.63.09గా ఉంది. అక్టోబర్ 18 నుంచి ఇప్పటివరకు ఒక్క రోజు తప్ప మిగతా అన్ని రోజులూ తగ్గుతూనే వస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండున్నర నెలల కాలంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.13.79 తగ్గడం విశేషం. అటు డీజిల్ ధరలు ఇదే కాలంలో రూ.12.06 తగ్గింది. అక్టోబర్ 4న పెట్రోల్ ధర రికార్డు స్థాయిని చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అత్యధికంగా రూ.84, ముంబైలో అత్యధికంగా రూ.91.34 మార్క్‌ను పెట్రోల్ ధరలు అందుకున్నాయి. ఆగస్ట్ 16 నుంచి రెండు నెలల పాటు వరుసగా పెరిగిన ధరలు.. తర్వాత తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవడం, రూపాయి బలపడటం ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. రానున్న రోజుల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles