మండుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లుWed,September 13, 2017 04:45 PM

Petrol prices on 3 years high after introducing daily price revise

న్యూఢిల్లీ: రోజువారీ ధ‌ర‌ల్లో మార్పు ఏంటోగానీ.. కొన్ని నెల‌లుగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మండిపోతున్నాయి. తాజాగా మూడేళ్ల గ‌రిష్ఠానికి ధ‌ర‌లు చేరాయి. గ‌రిష్ఠంగా 2014, ఆగ‌స్ట్ 1న పెట్రోల్ లీట‌ర్‌కు రూ.81.75గా ఉంది. తాజాగా బుధ‌వారం ముంబైలో అది రూ.79.48కి చేరింది. ఇటు హైద‌రాబాద్‌లోనూ లీట‌ర్ రూ.74.52గా ఉంది. ఇక డీజిల్ హైదరాబాద్‌లో ప్ర‌స్తుతం రూ. 63.79గా ఉంది. పెట్రోలియం ఉత్ప‌త్తులు జీఎస్టీ కిందికి రాక‌పోవ‌డంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ధ‌ర‌లు ఉన్నాయి. రోజువారీ ధ‌ర‌ల అమ‌లు ప్ర‌వేశ‌పెట్టిన తర్వాత పెట్రోల్ ధ‌ర ఏకంగా రూ.7 వ‌ర‌కు పెరిగింది. అయినా ఈ ప‌ద్ధ‌తినే కొన‌సాగిస్తామ‌ని ఈ మ‌ధ్యే పెట్రోలియం మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌ద్ధ‌తి వ‌ల్లే డీల‌ర్ల‌కైనా, వినియోగ‌దారుల‌కైనా లాభం ఉంటుంద‌న్న‌ది మంత్రి వాద‌న‌. రోజువారీగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర త‌గ్గితే ఇక్క‌డా తగ్గుతుంది. అయితే ఇది ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచీ పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గింది లేదు. గ‌తంలో 15 రోజుల‌కోసారి పెట్రోల్ ధ‌ర‌ల‌ను స‌మీక్షించేవాళ్లు.

7188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS