పెట్రోల్ ధరలు పెరగడం గుడ్ న్యూసే కదా!

Tue,September 4, 2018 01:15 PM

Petrol and Diesel rates hit record high and BJPs Nalin Kohli calls it good news

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం రికార్డు స్థాయిని చేరాయి. ఇవాళ లీటర్‌కు పెట్రోల్‌పై 16 పైసలు, డీజిల్‌పై 19 పైసలు పెరిగింది. అయితే ధరలను నియంత్రించాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే వీటిని లైట్ తీసుకుంటున్నది. పైగా పెట్రో ధరలు పెరగడం గుడ్ న్యూసే కదా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి అనడం గమనార్హం. ధరలు పెరగడం రాష్ర్టాలకు మంచి వార్తే. వ్యాట్ ద్వారా మరింత ఆదాయం వాళ్లకు వస్తుంది. ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా కేంద్రానికి కూడా ఆదాయం వచ్చినా.. రాష్ర్టాలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది అని నళిన్ కోహ్లి అన్నారు.

అయితే పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ కిందికి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని ఆయన స్పష్టంచేశారు. ముంబైలో మంగళవారం పెట్రోల్ ధర లీటర్‌కు అత్యధికంగా రూ.86.72కు, డీజిల్ ధర రూ.75.74కు చేరింది. రాష్ర్టాలు విధించే పన్నులు, సెస్‌ను బట్టి ఈ ధరల్లో కాస్త అటుఇటూగా మార్పులు ఉంటాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణిస్తుండటం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.

5533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles