Telangana Intermediate 1st & 2nd Year Results 2019

చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Fri,September 7, 2018 12:27 PM

Petrol and Diesel prices hit all time high again on Friday

ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రూపాయి విలువ పడిపోతుండటం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలను పెంచుతుండగా.. ఆ భారం మనపై కూడా పడుతున్నది. శుక్రవారం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ఆల్‌టైమ్ హై రూ.87.39ని తాకింది. ఒక్కరోజే లీటర్‌కు 48 పైసలు పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.79.99కి చేరింది. డీజిల్ ధర శుక్రవారం ఢిల్లీలో లీటర్‌కు 52 పైసలు, ముంబైలో 55 పైసలు పెరగడం గమనార్హం. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.91, డీజిల్ ధర రూ.78.48గా ఉంది.

ఈ మధ్యకాలంలో బుధవారం ఒక్కరోజే పెట్రో ధరలను మార్చకుండా ఉంచారు. గురు, శుక్రవారాల్లో మళ్లీ యాథావిధిగా ధరలు పెంచారు. ధరల ఈ స్థాయిలో పెరుగుతున్నా.. ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. రోజువారీ లేదా వారం వారం పెట్రోధరలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పడం విశేషం.

2916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles