పుల్వామా దాడి.. జైషే ప‌నే: ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్‌

Thu,February 21, 2019 09:07 AM

Pervez Musharraf accepts JeM hand in Pulwama attack

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జ‌రిగిన కారు బాంబు దాడి ఘ‌ట‌న‌పై పాకిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర్ర‌ఫ్ స్పందించారు. ఫిదాయిన్ దాడికి పాల్ప‌డింది.. జైషే ఉగ్ర‌వాదే అని ముష్ర‌ర‌ఫ్ అన్నారు. కానీ ఆ దాడిలో పాకిస్థాన్ హ‌స్తం లేద‌న్నారు. ఓ ప్రైవేటు టీవీ ఛాన‌ల్‌కు ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. పుల్వామా దాడి దారుణ‌మ‌ని, దాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. త‌న మీద కూడా జైషే దాడి చేసింద‌ని, జైషే సంస్థ‌పై ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు కూడా సానుభూతి ఉండ‌ద‌నుకుంటాన‌న్నారు. పుల్వామా అటాక్‌.. మౌలానానే చేశాడ‌ని, జైషేనే చేసింది, పాక్ ప్ర‌భుత్వాన్ని నిందించ‌రాద‌న్నారు. సంయుక్తంగా దర్యాప్తు చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌స్తుతం పాకిస్థాన్ ప‌రిస్థితి స‌రిగాలేద‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆ దేశం ఇలా చేయ‌ద‌న్నారు. జైషే ఉగ్ర‌వాద సంస్థపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముష‌ర్ర‌ఫ్ అన్నారు. ఆ సంస్థ‌ను బ్యాన్ చేయాల‌న్నారు. ఈనెల 14వ తేదీన పుల్వామాలో జ‌రిగిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే.

పాకిస్థాన్ మ‌రో మాజీ అధ్య‌క్షుడు అసిఫ్ అలీ జ‌ర్దారీ.. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప‌ట్ల తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇమ్రాన్‌కు అంత‌ర్జాతీయ రాజ‌కీయాల‌పై స‌రైన అవ‌గాహ‌న‌లేద‌న్నారు. ఇమ్రాన్ అప‌రిప‌క్వంగా ప్ర‌వ‌ర్తించార‌ని, పుల్వామా దాడి ప‌ట్ల భార‌త్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఇమ్రాన్ స‌రిగా తిప్పికొట్ట‌లేద‌న్నారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ముంబై దాడులు జ‌రిగాయ‌ని, అయితే అప్పుడు కూడా త‌మ‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని, వాటికి దౌత్య‌ప‌రంగా స‌మాధానం ఇచ్చామ‌ని, కానీ ఇమ్రాన్ అలా చేయ‌లేద‌న్నారు. ఎవ‌రో ఏదో చెబితే, వాటిని ఇమ్రాన్ ఆచ‌రిస్తున్నార‌ని జ‌ర్దారీ ఆరోపించారు.

1984
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles