ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.15 లక్షల రుణం!

Fri,July 21, 2017 11:07 AM

personal loan ICICI Bank offers up to Rs 15 lakh instant personal loan via ATMs

ముంబై : దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ విభాగంలో అతిపెద్ద సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్.. ఎంపిక చేసిన కస్టమర్లకు ఏటీఎంల ద్వారా వ్యక్తిగత రుణాలను ఆఫర్ చేస్తున్నది. వీరు ఏటీఎంల ద్వారా గరిష్ఠంగా రూ.15 లక్షల రుణం పొందే అవకాశం ఉంటుంది. వ్యక్తుల పరపతి సామర్థ్య సమాచార సేవలందించే సంస్థల (సిబిల్) వద్దనున్న డాటా ఆధారంగా రుణానికి అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఈ కస్టమర్లు ఏటీఎం ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారికి రుణ అర్హత గురించి తెలిపే సందేశాన్ని ప్రదర్శితమవుతుంది.

రుణం పొందాలనుకునే ఖాతాదారులు అప్పటికప్పుడే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా ఐదేండ్ల కాలపరిమితితో రూ.15 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఆ సొమ్ము తక్షణమే వారి ఖాతాలో జమవుతుంది. సొమ్మును వారి ఖాతాలో జమచేసే ముందే రుణంపై వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజు, నెలవారీ కిస్తీ చెల్లింపులు(ఈఎంఐ) వంటి కీలక సమచారాన్ని కస్టమర్లకు తెలుపడం జరుగుతుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది.

1432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles