జంగిల్ రాజ్ అనడం సరికాదు?: తేజస్వి యాదవ్

Thu,May 12, 2016 03:05 PM

People who level allegations of 'Jungle Raj' on Bihar, I just asked them to define 'Jungle Raj': Tejashwi Yadav

పాట్నా: బీహార్‌లో నడిరోడ్డుపై ఓ యువకున్ని అధికార జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవీ కుమారుడు రాకీ యాదవ్ కాల్చి చంపడంపై డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. నడిరోడ్డుపై యువకున్ని కాల్చిచంపడం దురదృష్టకరం, విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులు ఎంతటి వారైన వదలబోమని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. తమ రాష్ట్రంలో జంగిల్ రాజ్ ఏలుతోందని విమర్శలు చేస్తోన్న ప్రతిపక్షం అసలు జంగిల్ రాజ్ అంటే ఏమిటో వివరించాలని అడిగారు. ఇక్కడ జంగిల్ రాజ్ గురించి మాట్లాడుతున్న వాళ్లు వేరే రాష్ట్రల్లో జరుగుతోన్న సంఘటనల గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. ప్రతిపక్షాలు బీహార్‌లో జంగిల్ రాజ్ అనడగం సరికాదన్నారు.

ఢిల్లీలో ఇంతకంటే ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా వాటిపై ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. ఎంపీలో వ్యాపం కుంభకోణం కారణంగా పలువురు హత్యలకు గురవుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు కనిపించడంలేదా? అని మండిపడ్డారు. ఇవి జంగిల్ రాజ్ కావా? అని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో జాట్ల ఆందోళన సందర్భంగా జరిగిన అత్యాచారాలు జంగిల్ రాజ్ కిందకు రావా? అని ప్రశ్నించారు.

1843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles