రేషన్ దుకాణాల వద్ద భారీగా క్యూలైన్లు

Fri,January 11, 2019 11:11 AM

People queue up at ration shops for Pongal gift in Tamilanadu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు పొంగల్ (సంక్రాంతి)కానుకలను అందిస్తున్న విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం రూ.1000 నగదుతోపాటు కొన్ని సరుకులను బహుమతిగా ఇస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వ కానుకలను తీసుకునేందుకు లబ్ధిదారులంతా పెద్ద సంఖ్యలో రేషన్ దుకాణాల ఎదుట క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. ప్రభుత్వ ఖజానా తప్పుతోవ పట్టకుండా.. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న రేషన్ దారులకు మాత్రమే పొంగల్ కానుకలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం అందిస్తున్న పొంగల్ గిఫ్ట్ ప్యాక్‌లో రూ.1000 నగదుతోపాటు ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, రెండు ఫీట్ల చెరుకు గెడ, 20 గ్రాముల జీడిపప్పు, 20 గ్రాముల ఎండుద్రాక్ష, 5 గ్రాముల యాలకులు ఉన్నాయి


4059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles