అరుణాచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జీ గవర్నర్‌గా పీబీ ఆచార్య

Sat,January 28, 2017 05:43 PM

PB Acharya takes charge of Arunachal Pradesh

ఈటానగర్: నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్య నేడు అరుణాచల్‌ప్రదేశ్ ఇన్‌ఛార్జీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాగాలాండ్ గవర్నర్ వి. షణ్ముగనాథన్ రాజీనామాతో పీబీ ఆచార్య బాధ్యతలు చేపట్టారు. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజిత్ సింగ్ పీబీ ఆచార్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో గల దర్భర్ హాల్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చాలా సాదాసీదాగా గడిచిపోయింది. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర సీఎం ఫెమా ఖండూ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యగోపాల్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, తమిళనాడుకు చెందిన షణ్ముగనాథన్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం రోజు తన గవర్నర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌ను యంగ్ లేడీస్ క్లబ్‌గా మార్చిన షణ్ముగనాథన్‌ను పదవి నుంచి వెంటనే తప్పించి రాజ్‌భవన్ ప్రతిష్టను కాపాడాలని కోరుతూ 100 మంది రాజ్‌భవన్ ఉద్యోగులు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు.

1012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles