అనిల్‌ అంబానీ డబ్బు చెల్లించకపోతే.. 3 నెలల జైలుశిక్ష

Wed,February 20, 2019 11:21 AM

Pay Rs 453 crore in 4 weeks or face 3-month jail

న్యూఢిల్లీ: ఎరిక్సన్‌ ఇండియా కేసులో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ అధినేత అనిల్‌ అంబానీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్‌ అంబానీపై దాఖలైన కోర్టు ధిక్కారం కేసులో సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. అనిల్‌ అంబానీ, మరో ఇద్దరు రిలయన్స్‌ గ్రూప్‌ డైరెక్టర్లు రిలయన్స్‌ టెలికం ఛైర్మన్‌ సతీశ్‌ సేథ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఛైర్‌పర్సన్‌ ఛాయా విరానీ 4 వారాల్లోగా రూ.453కోట్లు చెల్లించాలని ఆదేశించింది. డబ్బు చెల్లించకపోతే కనీసం 3 నెలలు జైలుశిక్ష విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌ ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున జరిమానా విధించిన కోర్టు.. జరిమానా మొత్తాన్ని డిపాజిట్‌ చేయకుంటే నెల పాటు జైలుశిక్ష విధిస్తామని సుప్రీం హెచ్చరించింది. ఆర్‌కామ్‌కు చెందిన ఆస్తులను రిలయన్స్‌ జియోకు విక్రయించిన తర్వాత కూడా తమకు రూ.550కోట్ల బకాయి చెల్లించకపోవడంపై ఎరిక్సన్‌ ఇండియా పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.2219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles