అమరావతిని ఆపేస్తాం.. రాజధానిని అడ్డుకుంటాం: పవన్ కల్యాణ్

Sat,July 28, 2018 03:23 PM

pawan kalyan speaks in Joint Action Committee for Protection of LARR 2013 conference

విజయవాడ: భూ దోపిడీపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 2013 భూ సేకరణ చట్టం- పరిరక్షణ పేరిట విజయవాడలో జనసేన ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అందరం వచ్చి సీఎం ఇంటి వద్ద కూర్చుంటామని పేర్కొన్నారు. అమరావతిని ఆపేస్తాం.. రాజధానిని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పారు. కేసులు పెడితే ఎదురు తిరగండి. మీకు అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తులపై ఆలోచిస్తా.. ఇప్పుడు ఉద్యమాలేనని వివరించారు.

చంద్రబాబు రాహుల్‌కు కన్నుకొట్టి మనమంతా ఒక్కటే అనగలరని అన్నారు. 1,850 ఎకరాల్లోనే రాజధాని అన్నారు. ఇప్పుడు రాజధాని లక్ష ఎకరాలకు చేరింది. బాధ్యతాయుత అభివృద్ధి చేయలేరా? అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా? అని బాబును ప్రశ్నించారు. ప్రజలు తోలు తీస్తారు.. గుర్తు పెట్టుకోండి. నేను ప్రజలను కదిలించగలను. డబ్బుతో నన్ను కొనలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

4246
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles