రెండు స్థానాల్లో పవన్‌ కల్యాణ్ పోటీ..!

Tue,March 19, 2019 12:07 PM

Pawan Kalyan says General body is in their final discussion from which two constituencies

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ నెలకొంది. రెండు అసెంబ్లీ స్థానాల్లో పవన్ పోటీ చేయనున్నారు. ఏయే స్థానాలో తేల్చేందుకు పార్టీ కార్యవర్గం విస్తృతంగా చర్చిస్తోందని మరో గంటలో ఈ వివరాలు వెల్లడిస్తానని పవన్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఇటీవల పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ నియోజకవర్గంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తిరుపతి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.1987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles