అరేబియా సముద్రంలో కూలిన పవన్ హన్స్

Thu,November 5, 2015 07:45 AM

Pawan Hans Chopper Crashes Into Arabian sea, 2 Pilots Missing

ముంబై : ఇద్దరు పైలట్లతో వెళుతున్న పవన్‌హన్స్ హెలికాప్టర్ ఒకటి అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఓఎన్‌జీసీ ఫ్లాట్‌ఫాం నుంచి టేకాఫ్ తీసుకున్న ఎనిమిది నిమిషాలకే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు గల్లంతయ్యారని రక్షణశాఖ వర్గాలు చెప్పాయి. హెలికాప్టర్ శిథిలాలు, గల్లంతైనవారి జాడ కోసం గాలింపు చేపట్టగా హెలికాప్టర్ తలుపు మాత్రం దొరికింది.

ముంబై తీరానికి 82 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్లు కెప్టెన్ ఈ శామ్యూల్, టీకే గుహ జాడ తెలియడం లేదు. 14 సీట్లు ఉండే ఈ హెలికాప్టర్ ఘటన జరిగిన సమయంలో సిబ్బందికి సంబంధించిన డ్యూటీలో లేకపోవడంతో ఇద్దరు పైలట్లే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.

1540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles