బాహుబలి2 మూవీ చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ చేశారు!

Thu,October 5, 2017 05:07 PM

Patient watches Baahubali2 movie while doctors performing brain surgery to her in Guntur

వైద్య శాస్త్రంలోనే ఇదో అరుదైన, అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. నూతన ఒరవడులకు శ్రీకారం చుడుతున్న ఈ సాంకేతిక యుగం ఎంతో ముందుకు వెళ్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన 43 ఏండ్ల వినయ కుమారికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చింది. దీంతో గత వారం గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేశారు. ఇందులో స్పెషల్ ఏముంది అని అప్పుడే తొందరపడకండి. ఆ మహిళకు ఆపరేషన్ చేస్తున్నంతసేపు బాహుబలి2 సినిమా చూపించారు. అదే ఈ ఆపరేషన్ స్పెషల్.

ఈ అరుదైన సర్జరీని మెలుకువతో ఉండే బ్రెయిన్ సర్జరీ అంటారట. సర్జరీ చేస్తున్నంత సేపు ఆ మహిళ మెలుకువతో ఉండాలని.. ఉద్వేగానికి లోను కాకూడదని ఆ మహిళకు బాహుబలి2 సినిమా చూపించారు వైద్యులు. అంతే కాదు.. సర్జరీ జరుగుతున్నంత సేపు ఆ మహిళ సినిమా చూస్తూ... దండాలయ్యా పాటను తన నోటిలో పాడుతూ గడిపిందని ఆ మహిళకు అపరేషన్ చేసిన న్యూరోసర్జన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గంటన్నరలో సర్జరీని సక్సెస్‌ఫుల్‌గా వైద్యులు పూర్తి చేసి.. ఐదు రోజుల రెస్ట్ తర్వాత ఆ మహిళను డిశ్చార్జ్ చేశారట. ఇక.. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో పేషెంట్ గిటార్ ప్లే చేస్తుండగా డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేసిన సంగతి తెలిసిందే.

5628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS