ఉత్తర కర్ణాటకలో పాక్షికంగా బంద్

Thu,August 2, 2018 12:11 PM

Parties divided over North Karnataka Bandh call across 13 districts on Thursday

బెంగళూరు : ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో ఆగస్టు 2న ఉత్తర కర్ణాటక బంద్‌కు ఆయా సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటక బంద్ పాక్షికంగా కొనసాగుతుంది. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాజ్య హోరాట సమితి(యూకేపీఆర్‌హెచ్‌ఎస్) ఆధ్వర్యంలో ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి స్పందించి.. ఉత్తర కర్ణాటకలోని బెళగావిని రాష్ట్ర రెండో రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని నిన్న చెప్పారు. దీంతో యూకేపీఆర్‌హెచ్‌ఎస్.. బంద్‌ను విరమించుకుంది.

కానీ ఉత్తర కర్ణాటక రైత సంఘ్ మాత్రం బంద్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. రైత సంఘ్‌కు పలు సంఘాలు మద్దతు తెలిపినప్పటికీ బంద్ మాత్రం పాక్షికంగా కొనసాగుతుంది. ఈ బంద్‌పై కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. ఉత్తర కర్ణాటక బంద్ వెనుకాల బీజేపీ ఉందని ఆరోపించారు. రాష్ర్టాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తున్నామని.. ఇప్పుడున్న కర్ణాటకనే భవిష్యత్‌లో ఉంటుందని శివకుమార్ స్పష్టం చేశారు.

701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles