న‌కిలీ వార్త‌ల‌ను అడ్డుకోండి.. ఎఫ్‌బీ, వాట్సాప్‌, ఇన్‌స్టాల‌కు ఆదేశం

Wed,March 6, 2019 03:42 PM

Parliamentary panel asks FB, WhatsApp to tackle fake news, engage more with ECI

హైద‌రాబాద్‌: సోష‌ల్ మీడియా దిగ్గజ సంస్థ‌లు అయిన ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌తో ఇవాళ ఐటీశాఖ పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ భేటీ అయ్యింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు స్టాండింగ్ క‌మిటీకి ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో మ‌రింత లోతుగా క‌లిసి ప‌నిచేయాల‌ని ఆ సంస్థ‌ల‌ను క‌మిటీ కోరింది. యూజ‌ర్ల డాటాను సుర‌క్షితంగా కాపాడుతున్నార‌న్న అంశంపై పూర్తి స్థాయి స‌మాచారాన్ని ఇవ్వాల‌ని ఎఫ్‌బీ, వాట్సాప్‌, ఇన్‌స్టా సంస్థ‌ల‌ను కేంద్ర ప్యానెల్ డిమాండ్ చేసింది. అనురాగ్ థాకూర్ నేతృత్వంలోని క‌మిటీ.. సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌తో చ‌ర్చించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌కిలీ వార్త‌ల ప్ర‌చారాన్ని అడ్డుకోవాల్సిన అంశంపై థాకూర్ ఆ సంస్థ‌ల నుంచి వివ‌ర‌ణ కోరారు. స‌మాజంలో విభ‌జ‌న క్రియేట్ చేయ‌వ‌ద్దు అంటూ థాకూర్ ఆ సంస్థ‌ల‌ను కోరారు. హింస‌ను ప్రేరేపించ‌కుండా చూడాల‌న్నారు. మ‌న ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో విదేశాలు జోక్యం చేసుకోకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆ సంస్థ‌ల‌కు సూచించారు. ఎన్నిక‌ల సంఘంతో ఎప్ప‌డూ ట‌చ్‌లో ఉంటామ‌ని సోష‌ల్ మీడియా సంస్థ‌లు తెలియ‌జేసిన‌ట్లు థాకూర్ చెప్పారు.

1175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles