కరుణ మృతికి నివాళిగా పార్లమెంట్ వాయిదా

Wed,August 8, 2018 12:24 PM

Parliament adjourned for the day in respect of death of Karunanidhi

న్యూఢిల్లీ: ద్రవిడ దళపతి, డీఎంకే చీఫ్, కలైంజర్ కరుణానిధి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్‌ను వాయిదా వేశారు. కరుణ మృతికి గౌరవ సూచకంగా పార్లమెంట్‌ను ఇవాళ వాయిదా వేశారు. కరుణానిధి.. రాజ్యసభ లేదా లోక్‌సభకు ఎప్పుడూ ఎంపిక కాలేదు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఉభయ సభలు.. ఒక మాజీ సీఎం మృతి పట్ల పార్లమెంట్‌ను వాయిదా వేయడం ఇదే మొదటిసారి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, స్పీకర్ సుమిత్రా మహాజన్, పార్లమెంటరీ శాఖ మంత్రి అనంత్ కుమార్, ఇతర ఫ్లోర్ లీడర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశరాజకీయాల్లో కరుణానిధి ఓ గొప్ప నేత అని, ఆయన మృతికి నివాళిగా పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు కమిటీ పేర్కొన్నది.565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS