15 నెలల చిన్నారిని రాయికి కట్టేశారు..

Wed,May 18, 2016 11:24 AM

Parents Tie Toddler To Rock While They Work

అహ్మదాబాద్ : కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు.. జానెడు పొట్టను నింపుకోవడం కోసం పడరాని కష్టాలు పడుతుంటారు కొందరు. కొంతమంది వలస కూలీలైతే ముక్కుపచ్చలారని పిల్లలను రాళ్లకు, చెట్లకు కట్టేసి శ్రమిస్తున్నారు. అహ్మదాబాద్‌లోని ఓ నిర్మాణ ప్రదేశం వద్ద హృదయం చలించే దృశ్యాలు కనిపించాయి. పదిహేను నెలల చిన్నారి శివానిని తమ తల్లిదండ్రులు రాయికి కట్టేసి పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్నారి ఏటు వెళ్లకుండా ఆమె కాళ్ళను పెద్ద తాడుతో రాయికి కట్టేశారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో చిన్నారి తీవ్ర అయాస పడింది.

దీనిపై శివాని తల్లి సర్తా(23)ను పలకరించగా.. ఆమె భద్రత విషయంలో ఇది తప్ప మరో మార్గం లేదని చెప్పింది. తన మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నప్పటికీ శివానిని కంట్రోల్ చేయలేడని తెలిపింది. విద్యుత్ లైన్ల కోసం గుంతలు త్రవ్వితే రోజుకు రూ. 250 చొప్పున కూలీ ఇస్తారని పేర్కొంది. ఇక ఇండియాలో సుమారు 40 మిలియన్ల వలస కూలీలున్నారు. ఐదుగురు పురుషులలో ఒక మహిళ కూలీ ఉంటున్నారు. చాలా మంది వలస కూలీలు తమ పిల్లలను రాళ్లకు, చెట్లకు కట్టేయడం సహజమైపోయింది.

2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles