కూతురిని చంపిన తల్లిదండ్రులు

Tue,August 7, 2018 12:35 PM

లక్నో : తాంత్రికుడి మాటలు నమ్మి.. తమ కూతురిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టారు తల్లిదండ్రులు. ఎందుకో తెలుసా? తర్వాత పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా పుట్టాలంటే ఈ బిడ్డను చంపి ఇంట్లోనే పాతిపెట్టాలని తాంత్రికుడు ఆ తల్లిదండ్రులకు చెప్పాడు. మోర్దాబాద్‌కు చెందిన ఇద్దరు దంపతులకు తారా(6) అనే కుమార్తె ఉంది. పుట్టినప్పటి నుంచి ఆ చిన్నారి బలహీనంగా ఉంది. శరీరంలో ఎదుగుదల లేకపోవడం.. బక్కగా అవుతుండడంతో.. తారా తల్లిదండ్రులు ఓ తాంత్రికుడిని సంప్రదించారు. ఈ బిడ్డ కోలుకోలేదని.. ఆ చిన్నారిని హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాలని తల్లిదండ్రులకు తాంత్రికుడు సూచించాడు.


ఇలా చేస్తే తర్వాత పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటాడని తాంత్రికుడు చెప్పాడు. దీంతో ఆయన చెప్పిన విధంగానే తారా తల్లిదండ్రులు చేశారు. అయితే ఈ విషయం పొరుగింటి వాళ్లకు తెలియడంతో.. పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో పాతిపెట్టిన తారా మృతదేహాన్ని బయటకు తీశారు.

పోషకాహారం లోపం వల్లే చిన్నారి బలహీనంగా మారిందని.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని గొంతునులిమి చంపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిన్నారి నానమ్మ మాట్లాడుతూ.. తారాకు ఎన్ని మాత్రలు వేసినా.. లాభం లేకుండా పోయింది. బలహీనంగా మారుతూనే ఉంది. చివరకు రికెట్స్ వ్యాధి కూడా చిన్నారికి వచ్చిందని ఆమె పేర్కొంది.

5661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles