తిడుతున్నారని.. పేరెంట్స్‌ను చంపేశాడు

Thu,October 11, 2018 10:08 AM

parents killed by son for scolding him in Delhi

న్యూఢిల్లీ: దేశరాజధానిలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఒకే ఇంట్లో ముగ్గుర్ని కత్తితో పొడిచి చంపిన కేసులో పోలీసులు మిస్టరీ చేధించారు. ఈ కేసులో 19 ఏళ్ల సూరజ్‌ను అరెస్టు చేశారు. తన తల్లితండ్రులతో పాటు సోదర్ని కూడా అతనే కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కాలేజీకి సరిగా వెళ్లడం లేదని, ప్రవర్తన సరిగా లేదని పేరెంట్స్ మాటిమాటికీ తిట్టేవాళ్లు. దీంతో విసుగు చెందిన సూరజ్.. తన పేరెంట్స్‌ను హత్య చేసేందుకు ప్లానేసినట్లు పోలీసులు చెప్పారు. 12వ తరగతి ఎగ్జామ్స్‌కు డుమ్మాకొట్టిన అతను.. చాలా విలాసవంతమైన లైఫ్ స్టయిల్‌కు అలవాటుపడ్డాడు. కాలేజీ మానేసి డిస్కోతెక్‌లకు వెళ్తున్నాడు. దీంతో ఆగ్రహించిన తండ్రి ఇటీవల సూరజ్‌పై చేయి చేసుకున్నాడు. అయితే పేరంట్స్ తిట్టడాన్ని తట్టుకోలేకపోయిన సూరజ్ వారి హత్యకు ప్లానేశాడు. ఆ ప్లాన్ ప్రకారం అమ్మానాన్నలతో పాటు సోదర్ని కూడా హత్య చేశాడు. కత్తి, కత్తెర కొనుక్కొని వచ్చిన సూరజ్.. తెల్లవారుజామున 3 గంటలకు మొదటి తండ్రిపై దాడి చేసి అయిదుసార్లు పొడిచాడు. ఆ తర్వాత తల్లిని పొడిచాడు. అరుపులు విన్న సోదరి గొంతును కూడా కోసేశాడు. ఆ తర్వాత కత్తిని కడిగి.. అక్కడే మంచం కింద వేశాడు. అయితే తన మర్డర్ ప్లాన్ తెలియకుండా ఉండేందుకు.. ఇదో దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించేందుకు సూరజ్ ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు.

4326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles