బీజేపీలో చేరిన పారాలింపియన్ దీపామాలిక్

Mon,March 25, 2019 06:37 PM

Paralympian Deepa Malik joined BJP


న్యూఢిల్లీ : పారాలింపియన్ దీపామాలిక్ బీజేపీలో చేరారు. హర్యానా బీజేపీ శాఖ అధ్యక్షుడు సుభాష్ బరాలా దీపామాలిక్ కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దీపామాలిక్ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా దీపామాలిక్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోదీ తన ఆలోచనలతో మహిళల సాధికారతకు కృషి చేశారని అన్నారు. మహిళలకు కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించారని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేశారని పేర్కొన్నారు. పారాలింపిక్ గేమ్స్ లో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా దీపామాలిక్ రికార్డు సృష్టించారు.

941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles