పాన్ కార్డులు లేనివారికి మాత్రమే ఉపయోగకరం

Thu,December 6, 2018 10:19 PM

pan card aadhar seeding supreme court decision

న్యూఢిల్లీ : పౌరులు తమ ఆధార్ నంబర్‌ను ఉపసంహరించుకొనే అవకాశాన్ని ప్రభుత్వం త్వరలో కల్పించనున్నది. తమ బయోమెట్రిక్ (వేలిముద్రలు), ఇతర డేటాను కూడా పౌరులు వెనుకకు తీసుకునే వెసులుబాటును కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు ఆధార్ చట్టంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆధార్ చెల్లుబాటును ఆమోదించినప్పటికీ కొన్ని షరతులు విధించింది. ప్రైవేటు సంస్థలు ఆధార్ వివరాలను పరిశీలించే సదుపాయాన్ని కొట్టివేసిన కోర్టు, సిమ్‌కార్డులు, బ్యాంక్ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఆధార్ చట్టానికి చేయాల్సిన మార్పులపై వచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. తొలుత 18 ఏండ్లు దాటినవారు తమ ఆధార్‌ను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల గడువును ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో విభేదించిన కేంద్ర న్యాయశాఖ ఉపసంహరించుకొనే అవకాశం పౌరులందరికీ ఇవ్వాలని సూచించిందని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటివరకు పాన్‌కార్డు లేని వారికి మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు. పాన్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

4161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles