కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌

Sat,September 21, 2019 11:59 AM

జమ్మూకశ్మీర్‌ : పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘించింది. షాహాపూర్‌, కెర్ని సెక్టార్‌లో శనివారం ఉదయం 9:45 గంటలకు పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు. ఫూంచ్‌ జిల్లాలోని బాలాకోట్‌ సెక్టార్‌లో కూడా నిన్న రాత్రి కాల్పులకు పాల్పడ్డారు. పాక్‌ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్‌ కాల్పులకు కల్సియాన్‌ ఏరియాలో పలు నివాసాలు ధ్వంసం అయ్యాయి. మోర్టార్ల ధాటికి ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. ఒక దూడ చనిపోయినట్లు పోలీసు అధికారి తెలిపారు. పాక్‌ కాల్పుల నేపథ్యంలో సరిహద్దుకు జమ్మూకశ్మీర్‌ పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.650
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles