బాలాకోట్‌కు విదేశీ జ‌ర్న‌లిస్టులు..

Thu,April 11, 2019 04:51 PM

Pakistan takes media, diplomats on tour of Balakot

హైద‌రాబాద్‌: పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత భార‌త్ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌తో పాటు బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర‌స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. అయితే పాకిస్థాన్ మాత్రం త‌మకు ఎటువంటి న‌ష్టంక‌ల‌గ‌లేదంటున్న‌ది. త‌మ వాద‌న‌ను నిరూపించేందుకు పాకిస్థాన్ ఇవాళ కొంద‌రు విదేశీ జ‌ర్న‌లిస్టుల‌ను బాలాకోట్‌కు తీసుకువెళ్లింది. బాలాకోట్‌లో ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని ఆ దేశ మిలిట‌రీ పేర్కొన్న‌ది. బాలాకోట్‌లోని ఓ ప్రాంతాన్ని ప‌రిశీలిస్తున్న విదేశీ జ‌ర్న‌లిస్టుల ఫోటోను ఆ దేశ మిలిట‌రీ ట్వీట్ చేసింది. భార‌త్ మాత్రం బాలాకోట్‌లోని జైషే ఉగ్ర స్థావ‌రాన్ని ధ్వంసం చేసిన‌ట్లు చెప్పుకుంటున్న‌ది.

1238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles